Jr NTR Gets Emotional About His Fan || Filmibeat Telugu

2019-05-06 396

Telugu actor Jr NTR fan and Krishna district fans association representative Jayadev is no more. NTR expressed deep condolence to Jayadev family.
#ntr
#tollywood
#rrr
#rajamouli
#movienews
#krishnadistrict
#vijayawada
#jayadev
#ntrfans
#nandamuribalakrishna

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన అభిమానులను ఎలా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమా వేడుకలోనూ ఫ్యాన్స్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు. తన సినిమా వేడుక నుంచి ఇంటికి వెళ్లేపుడు జాగ్రత్తగా వెళ్లాలని జాగ్రత్తలు చెబుతారు. అభిమానులకు ఏమైనా అయితే తట్టుకోలేని మనస్తత్వం ఆయనది. అలాంటి వ్యక్తి తన తొలి అడుగు నుంచి వెన్నంటి ఉన్న అభిమానికి ఏమైనా అయితే ఎంత బాధ పడతారో మాటల్లో చెప్పడం కష్టమే. ప్రస్తుతం యంగ్ టైగర్ అలాంటి బాధలోనే ఉన్నారు. ముందు నుంచి తనకు తోడుగా ఉన్న అభిమాని ఇక లేరు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. బాధను వ్యక్తం చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు.